ఒకే కథ ముగ్గురు హీరోలు

తెలుగు ఇండస్ట్రీలో లో ఒక వింత జరిగింది, ఇటీవలే ప్రారంభం అయిన నితిన్ సినిమా మధ్యలోనే ఆగిపోయింది, పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందని అందరు  అనుకుంటున్నారు , విషయం ఏంటంటే… ఈ మధ్య రాజ్ తరుణ్ అంధ గాడు సినిమా కథలో హీరో బ్లైండ్ , అలాగే రవితేజ & అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ సినిమాలో కూడా హీరో గుడ్డివాడు, అలా దాదాపు ఓకె కాన్సెప్ట్ తో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి, అయితే నితిన్ సినిమాలో కూడా హీరో గుడ్డివాడు. అందువల్ల నితిన్ ఈ సినిమాను పక్కన పెట్టి బెంగాల్ టైగర్ సినిమా నిర్మాతతో చేయబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది, అలాంటప్పుడు అదే కాన్సెప్ట్ తో మళ్ళి సినిమా ఎందుకని నితిన్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ రెండు సినిమాకు ఒక కొరియన్ సినిమాను కాపీ కొట్టి తీస్తున్నారని ఫిలిం నగర్ టాక్.

Related posts