ఓయ్ నిన్నే ఆకట్టుకుంటుంది.

హృదయాన్ని హత్తుకున్న ‘ఓయ్‌.. నిన్నే’

తొలి చిత్రంలోనే ఆకట్టున్న మార్గాని భరత్‌

అభినందించిన శాసనమండలి డిప్యూటి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : ప్రముఖ బిసి నాయకులు మార్గాని నాగేశ్వరరావు తనయుడు మార్గాని భరత్‌ హీరోగా, స ష్టి ధాంగే హీరోయిన్‌గా నటించిన

‘ఓయ్‌.. నిన్నే’ సినిమా హృదయాలను హత్తుకునేలా ఉంది. సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీక ష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం హాస్యం మేళవించిన చక్కని కుటుంబ కధా చిత్రంగా ప్రేక్షకులను రంజింపచేసింది. తొలి చిత్రంలోనే మార్గాని భరత్‌ మంచి నటనను ప్రదర్శించి, పల్లెటూరి యాసతో అందరిని ఆకుట్టుకునే పాత్రలో ఒదిగిపోయాడు. పెద్ద హీరోల సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలు, మాటలు, కామెడీ, లోకేషన్లు, సంగీతం, చిత్రీకరణ అన్ని హైలైట్‌ గా నిలిచాయి. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయ భేధాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమకథ చిత్రానికి కామెడీ కాస్త అదిరింది. ప్రేక్షకులను ఆనందింపచేసింది. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్‌, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు తమ పాత్రలకు జీవం చేసారు. సత్య చల్లకోటికి దే మొదటి చిత్రం అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్‌.. నిన్నే’ను తీర్చిదిద్దాడు. ఈ చిత్రం కుటుంబ పరంగా చూడతగ్గ చిత్రంగా మలిచారు. సినిమా ఈ రోజు విడుదల కావడంతో రాజమహేంద్రవరం ఊర్వశి థియేటర్‌లో శాసనమండలి డిప్యూటి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, క్రెడాయ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్‌, గౌడ శెట్టిబలిజ సంఘ నాయకులు రెడ్డి రాజు తదితరులు కలిసి మార్గాని భరత్‌ ఈ చిత్రం మార్నింగ్‌ షోను వీక్షించారు. షో అనంతరం రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హీరో భరత్‌ కి మంచి భవిష్యత్తు ఉందని, తొలి చిత్రంలో తన నటనతో అందరి హృదయాలను ఆకట్టుకోవడం ఖాయమన్నారు. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో మార్గాని భరత్‌ అభిమానులు ధియేటర్‌ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Related posts