కొబ్బరిమట్ట అందరిని అలరిస్తుంది.

సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం కొబ్బరిమట్ట. రూపక్‌రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఇషికాసింగ్, గీతాంజలి కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ నేటితో చిత్రీకరణ పూర్తయింది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది అన్నారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ సంభాషణలు అందరిని కడుపుబ్బా నవ్విస్తాయి. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న చిత్రమిది అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

Related posts