మరో హీరొయిన్ తో త్రిష మాజీ లవర్

గత 15 సంవ్సత్సరాలుగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన భామ త్రిష. గత కొద్ది రోజులుగా ఆమెకు అవకాశాల సంఖ్య తగ్గినా, చేసే సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే చేస్తూ విజయాలను అందుకుంటోంది. గత ఏడాది  త్రిష కి బిజినెస్ మాన్ వరుణ్ మనియన్ కి ఎంగేజ్మెంట్ అయిపోయి ఇక త్వరలో పెళ్లి అని ట్విట్టర్ లో , ఫేస్ బుక్ లో అనౌన్స్ చేసారు, కాని పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలని వరుణ్ పేరెంట్స్ చెప్పడంతో ఆ విషయం నచ్చని త్రిష వరుణ్ తో పెళ్లి కాన్సిల్ చేసుకుంది.

తెలుగులో ఆవకాయ్ బిర్యానీ సినిమాతో ఎంటరైన బిందు మాధవి. రామ రామ కృష్ణ కృష సినిమాలో నటించింది, ఆ తరువాత బంపర్ ఆఫర్ సినిమాలో సోలో హిరోయిన్ గ నటించింది, ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ ఇక్కడ మంచి అవకాశాలు రాలేదు అయితే త్రిష మాజీ లవర్ తో   కొన్ని నెలలుగా  సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

Related posts