సూప‌ర్ స్టార్ తో ముర‌గ‌దాస్

 

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `కాలా` న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ముగ‌దాస్ సినిమాలో న‌టించ‌నున్నారా? అంటే అవున‌నే బ‌ల‌మైన సంకేతాలు అందుతున్నాయి. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ముర‌గ‌దాస్ ఆ ప్రాజెక్ట్ విష‌య‌మై ఆ స‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు.

సూప‌ర్ స్టార్ తో సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్నా. ఇప్ప‌టికే ఓ క‌థ కూడా వినిపించా. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఒక వేళ ఆ క‌థ కాక‌పోతే మ‌రో క‌థ‌ను ఆయ‌న కోసం నెల రోజు ల స‌మ‌యంలో సిద్దం చేస్తా. అయితే డేట్లు కుద‌రడ‌మే క‌ష్టం. ఇద్ద‌రూ ఫుల్ బిజీగా ఉన్నాం. ఇద్ద‌రికీ డేట్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు క చ్చితంగా సినిమా చేస్తామ‌ని ` తెలిపారు.

Related posts